భోపాల్ లో ఈవీఎంలు దాచిన స్ట్రాంగ్ రూముల్లో పని చేయని సీసీ కెమెరాలు... రంగంలోకి దిగిన ఈసీ!
- మధ్యప్రదేశ్ అభ్యర్థుల భవితవ్యాన్ని దాచుకున్న ఈవీఎంలు
- గంట పాటు పని చేయని సీసీటీవీ కెమెరాలు
- ట్యాంపరింగ్ జరిగిందంటున్న కాంగ్రెస్
- అటువంటిదేమీ లేదని ఈసీ వివరణ
సీసీటీవీ కెమెరాలు గంట పాటు పని చేయలేదన్న విషయాన్ని అంగీకరించిన అధికారులు, ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదని స్పష్టం చేశారు. పవర్ కట్ కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది.
సీసీటీవీ కెమెరాలు, స్ట్రాంగ్ రూమ్ బయటున్న ఎల్ఈడీ టీవీపై నిత్యమూ గదిని రికార్డు చేస్తున్న దృశ్యాలను ప్రసారం చేస్తున్నాయని, శుక్రవారం నాడు ఉదయం 8.19 గంటల నుంచి 9.35 వరకూ ఇవి పని చేయలేదని అధికారులు వ్యాఖ్యానించారు. ఈ స్ట్రాంగ్ రూముకు నిరంతర విద్యుత్ సరఫరాకు ఆదేశాలు జారీ చేశామన్నారు.