త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ ను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు!
- ఖమ్మంకు వచ్చిన మాణిక్ సర్కారు
- దుమ్ముగూడెం సమీపంలో ప్రచారం
- ప్రసంగాన్ని అడ్డుకున్న పోలీసులు
ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో, ట్రాఫిక్ ను మళ్లించలేకపోయామని, ఈ రోడ్ షోతో ట్రాఫిక్ కు అవాంతరాలు ఏర్పడుతున్నాయని పోలీసులు, మాణిక్ సర్కార్ ను అడ్డుకోవడంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి, ఖమ్మం వెళ్లిపోయారు. అంతకుముందు భద్రాచలం ఏఎస్పీ సంగా రామ్ సింగ్ పాటిల్, మాణిక్ సర్కారు వద్దకు వెళ్లి, పరిస్థితిని వివరించి, మరోసారి రోడ్ షో పెట్టుకోవాలని సూచించారు.