'కేజీఎఫ్' సినిమాను గురించి ప్రస్తావించిన శంకర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కేజీఎఫ్' సినిమాను గురించి ప్రస్తావించిన శంకర్

  • కన్నడ చిత్రంగా 'కేజీఎఫ్'
  • ట్రైలర్ బాగుందని అంటున్నారు 
  • సౌత్ సినిమాల స్థాయి పెరిగింది    
తెలుగులో అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళి కొనసాగుతున్నారు. ఆయన సినిమాలకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఏ సినిమాను గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా, అందరి దృష్టి ఆ సినిమాపైకి వెళుతుంది. అలాగే తమిళంలో భారీ ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడిగా శంకర్ కి ఒక రేంజ్ లో ఇమేజ్ వుంది. ఆసక్తికరమైన కథకు సాంకేతికతను జోడించి అందించడం ఆయన ప్రత్యేకత.

ఆయన ఏ సినిమాను గురించి మాట్లాడినా అక్కడి వాళ్లందరిలో ఆత్రుత మొదలవుతుంది. అలాంటి శంకర్ తాజా ఇంటర్వ్యూలో కన్నడ మూవీ 'కేజీఎఫ్' గురించి మాట్లాడటం విశేషం. 'ఉత్తరాది వాళ్లు 'కేజీఎఫ్' గురించి చర్చించుకోవడం నేను విన్నాను. 'కేజీఎఫ్' ట్రైలర్ చాలా బాగుందని వాళ్లు మాట్లాడుకోవడం నాకు ఆనందాన్ని కలిగించింది. సౌత్ సినిమాల స్థాయి పెరగడం .. భాషల హద్దులు చెరిగిపోయి పరిశ్రమల మధ్య అంతరాలు తగ్గిపోవడం సంతోషించవలసిన పరిణామం" అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 
shankar
yash

More Telugu News