ఆ ఘనత రజనీకే సొంతమంటోన్న ఫ్యాన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ఘనత రజనీకే సొంతమంటోన్న ఫ్యాన్స్

  • హీరోగా రజనీ సుదీర్ఘ ప్రయాణం 
  • ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమాలు 
  • ఎప్పుడూ ఎక్కడా వెనక్కి తగ్గని వైనం  
ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ కి అభిమానులు వున్నారు. ఈ తరం స్టార్ హీరోలు సైతం ఆయన సినిమా విడుదల తేదీలను బట్టి తమ సినిమాల విడుదల తేదీలను మార్చుకుంటూ వుంటారు. సుదీర్ఘమైన ప్రయాణంలో రజనీ గ్రాఫ్ పెరుగుతూ పోయింది. మారుతోన్న ప్రేక్షకుల అభిరుచిని .. సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ కారణంగా రజనీ పనైపోయింది అనే మాట ఎప్పుడూ ఎక్కడా వినిపించలేదు.

ఈ నేపథ్యంలో తమ అభిమాన కథానాయకుడు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడంటూ రజనీ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రజనీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చేశారు .. అలాగే కలర్ సినిమాల్లోను నటించారు .. 'కొచ్చాడియాన్'వంటి యానిమేటెడ్ చిత్రంలోను నటించారు. ఇక తాజాగా ఆయన హీరోగా '2.ఓ' త్రీడీ వెర్షన్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్ని రకాల సినిమాల్లో నటించిన ఘనత ఇండియాలో తమ హీరోదేనంటూ వాళ్లు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
rajani
akshay

More Telugu News