రికార్డులకెక్కిన హిమాచల్‌ప్రదేశ్.. ఇక అన్నింటికీ ఒకే హెల్ప్‌లైన్ నంబరు
- అన్ని సేవలకు ఒకే నంబరు
- బుధవారం ప్రారంభించిన హిమాచల్‌ప్రదేశ్
- మొబైల్ యాప్ కూడా ప్రారంభం
ఈఆర్‌సీలో పోలీస్ (100), అగ్నిమాపక (101), ఆరోగ్యం (108), మహిళా రక్షణ (1090) కలిసి ఉంటాయి. అత్యవసర సమయాల్లో వీటిలో ఏ ఒక్క సాయం అవసరమైనా 112 నంబరుకు కాల్ చేస్తే సరిపోతుంది. అమెరికాలోనూ ఇటువంటి సేవలే అందుబాటులో ఉన్నాయి. 911 నంబరుకు కాల్ చేయడం ద్వారా అవసరమైన సాయం పొందవచ్చు. ఇప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రారంభించిన 112 నంబరు దీనిని పోలి ఉంది. ఈ సేవలకు సంబంధించి ‘112 ఇండియా’ అనే మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు. ఇందులో ఓ ప్యానిక్ మీట ఉంటుంది. దీనిని నొక్కడం ద్వారా అత్యవసర సేవలు పొందవచ్చు.