సెకండ్ ప్రభాస్ అనిపించుకోవడం ఇష్టం వుండదు: కన్నడ హీరో యశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెకండ్ ప్రభాస్ అనిపించుకోవడం ఇష్టం వుండదు: కన్నడ హీరో యశ్

  • యశ్ హీరోగా 'కేజీఎఫ్' 
  • నాయికగా శ్రీనిధి శెట్టి 
  • డిసెంబర్ 21న విడుదల
కన్నడ స్టార్ హీరోగా యశ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. మాస్ హీరోగా అక్కడ ఆయనకి మంచి ఫాలోయింగ్ వుంది. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'కేజీఎఫ్' .. డిసెంబర్ 21వ తేదీన భారీస్థాయిలో రిలీజ్ కానుంది. కన్నడతోపాటు తెలుగు .. మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. బంగారు గనుల్లో పనిచేసే కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమైంది.

ఈ సినిమా నేపథ్యం 'ఛత్రపతి'కి దగ్గరగా ఉందనే ప్రచారం జరుగుతోంది. అలాగే యశ్ ఫిజిక్ చూసిన వాళ్లంతా ఆయనను సౌత్ లో సెకండ్ ప్రభాస్ గా ప్రస్తావిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో యశ్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ, 'నాకు సెకండ్ ప్రభాస్ అనిపించుకోవడం ఇష్టం ఉండదు .. మొదటి యశ్ అనిపించుకోవడంలోనే ఆనందం ఉంటుంది' అని అన్నాడు. అలాగే తమ సినిమాకి, 'ఛత్రపతి' సినిమాకి ఎలాంటి పోలికలు ఉండవని స్పష్టం చేశాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రీనిధి శెట్టి కనిపించనుంది.  
yash
srinidhi

More Telugu News