Telangana: రాహుల్ లాంటి కొడుకుంటే ఏ తల్లయినా నిజంగానే తల్లడిల్లుతుంది!: సోనియా గాంధీపై కేటీఆర్ సెటైర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ పరిస్థితిని చూసి ఓ తల్లిగా తల్లడిల్లుతున్నానని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నిన్నటి బహిరంగ సభలో చెప్పడంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. రాహుల్ గాంధీ లాంటి కొడుకు ఉంటే ఎవరైనా తల్లడిల్లడం మామూలేనని సెటైర్ వేశారు. సోనియా బాధ రాహుల్ గాంధీ గురించే తప్ప తెలంగాణ గురించి కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఈ రోజు నిర్వహించిన సీమాంధ్రుల సంఘీభావ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

వాస్తవానికి పెద్దావిడ (సోనియా) మంచిదేననీ, కానీ కొందరు దుర్మార్గులు ఆవిడను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ ను 9 సంవత్సరాల్లో కట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు అమరావతిని ఇంకా గ్రాఫిక్స్ లోనే ఎందుకు పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు మాటలు వింటే 430 సంవత్సరాల క్రితం భాగ్యనగరాన్ని నిర్మించిన రాజు కులీకుతుబ్ షా బాధపడతారని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Telangana
KTR
Sonia Gandhi
Rahul Gandhi

More Telugu News