టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుపై చెప్పులు, రాళ్లు విసిరిన గ్రామస్తులు
- ఈ నాలుగేళ్లలో ఏం చేశారు?
- ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చారు?
- నిలదీసి చెప్పులు విసిరిన లంబాడాలు
వెంకటేశ్వర్లు శుక్రవారం శ్రీరాంపురం, రేపల్లెవాడ గ్రామాల మీదుగా అన్నారం తండా, గానుగపాడు నుంచి పోకలగూడేనికి చేరుకున్నారు. గ్రామానికి ఆయన చేరుకోగానే స్థానికులు పెద్ద ఎత్తున ఆయనను చుట్టుముట్టారు. లంబాడాలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారంటూ నిలదీశారు. తమ గ్రామానికి ఈ నాలుగేళ్లలో ఏం చేశారని మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చారని నిలదీశారు. ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ చెప్పులు, రాళ్లు విసిరారు. అయితే, పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో ఆయన వెనుదిరిగారు.