తెలంగాణలో కూలీలకు యమ డిమాండ్... రెండు పూటలా భోజనం, రూ. 800 నగదు!
- మందీ, మార్బలం వెంట ఉండేలా చూసుకుంటున్న అభ్యర్థులు
- తమ రోజువారీ సంపాదనకన్నా అధికంగా డిమాండ్ చేస్తున్న కూలీలు
- పురుషులతో పోలిస్తే, మహిళలకు ముట్టేది తక్కువే
వీరిని తీసుకురావడం కూడా అంత సులువుగా ఏమీ లేదు. వీరికి ఫుల్ డిమాండుందిప్పుడు. తాము రోజుకు సంపాదించుకునే డబ్బు కన్నా అధికంగా ఇస్తేనే వస్తామని భీష్మించుకుని కూర్చుంటున్నారు వీరు. ఇక వీరితో డీల్ కుదిర్చి కావాల్సినంత మంది కూలీలను సమకూర్చేందుకు మధ్యవర్తులు కూడా తయారయ్యారు. ఇంటింటి ప్రచారం చేసే వేళ, వీరి అవసరం ఎక్కువగా ఉంటోంది. ప్రత్యేకించి డ్రస్ కోడ్ తో దుస్తులను వీరితో ధరింపజేసి, ప్రచారాన్ని కలర్ ఫుల్ గా మారుస్తున్నారు అభ్యర్థులు. చేతిలో జెండా, మెడలో కండువా, పార్టీ గుర్తు, చిన్నచిన్న వాహనాలు, రిక్షాబండ్లను వీరు తిప్పుతూ అభ్యర్థుల వెంట, వారి తరఫున ప్రచారం నిర్వహించే ఇతర నేతల వెంటా తిరుగుతున్నారు.