తెలంగాణ ఎన్నికలు... వందల కోట్ల ఆస్తులున్న శ్రీమంతులు వీరే!
- పలువురి పేరిట భారీ ఆస్తులు
- అత్యధిక మొత్తం ఉన్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వద్దే
- ఆయన ఆస్తులు రూ. 314 కోట్లకు పైనే
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్) : రూ. 314,31,70,406
మర్రి జనార్దన్ రెడ్డి (టీఆర్ఎస్) : రూ. 161,27,26,168
కే అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్): రూ. 151,13,99,281
యోగానంద్ (బీజేపీ) రూ. 146,67,57,584
నామా నాగేశ్వరరావు (టీడీపీ) : 110,01,80,475
ఇక కుటుంబ ఆస్తుల వివరాలు రూ. 50 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న వారిలో రాజేందర్ రెడ్డి (టీఆర్ఎస్ - నారాయణపేట), అమరేందర్ రెడ్డి (బీజేపీ - వనపర్తి), అమర్ సింగ్ (బీజేపీ - కార్వాన్), ఉపేందర్ రెడ్డి (కాంగ్రెస్ - పాలేరు), పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్ - జనగాం), వి ఆనంద ప్రసాద్ (టీడీపీ - శేరిలింగంపల్లి), వీరేందర్ గౌడ్ (టీడీపీ - ఉప్పల్), కే దయాకర్ రెడ్డి (టీడీపీ - మక్తల్)లు ఉన్నారు.