యాక్షన్ సన్నివేశాల్లో సాయిపల్లవి!
- మలయాళ చిత్రంలో సాయిపల్లవి
- థ్రిల్లర్ జోనర్లో సాగే కథాకథనాలు
- కథానాయకుడిగా ఫహాద్ ఫాజిల్
వివేక్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, థ్రిల్లర్ జోనర్లో రూపొందుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవికి యాక్షన్ సీన్స్ కూడా వున్నాయట. ఇప్పటివరకూ ప్రేమకథా చిత్రాల్లో ఆమె ఆడుతూపాడుతూ వచ్చింది. బలమైన సన్నివేశాల్లో మనసును బరువెక్కించింది. అలాంటి సాయిపల్లవి మొదటిసారిగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో కనిపించనుందని సమాచారం. యాక్షన్ సీన్స్ లో ఈ సుకుమారి ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి.