వరవరరావుకు ఈ నెల 26 వరకు పోలీస్ కస్టడీ

  • మావోయిస్టు అగ్రనేత గణపతి రహస్య స్థావరం ఆయనకు తెలుసన్న న్యాయవాది
  • 14 రోజుల పోలీసు కస్టడీకి అనుమతివ్వాలని అభ్యర్థన
  • 9 రోజులకు అనుమతించిన కోర్టు
విరసం సభ్యుడు వరవరరావును ఈ నెల 26 వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ పూణెలోని జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు విధించిన గృహనిర్బంధం ఈ నెల 15న  ముగిసిన నేపథ్యంలో శనివారం పూణె పోలీసులు హైదరాబాద్‌లో వరవరరావును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. మావోయిస్టు అగ్రనేత గణపతి రహస్య స్థావరాలతోపాటు మావోల లేఖల్లో ఉన్న కోడ్‌భాష గురించి విచారించేందుకు వరవరరావును పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరారు. వాదనలు విన్న కోర్టు 9 రోజులపాటు వరవరరావును పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో వరవరరావు ఇది వరకే ఓసారి అరెస్టైన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Varavara Rao
Activist
Maoist Ganpathi
Pune
police custody
Telangana

More Telugu News