లారెన్స్ నుంచి 'కాంచన 3' వచ్చేస్తోంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లారెన్స్ నుంచి 'కాంచన 3' వచ్చేస్తోంది

  • లారెన్స్ కథానాయకుడిగా 'కాంచన 3'
  • నాయికలుగా వేదిక - ఓవియా 
  • ఏప్రిల్ 18వ తేదీన విడుదల
హారర్ థ్రిల్లర్ సినిమాలకి దర్శకత్వం వహించడంలోను .. ఆ సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించడంలోను లారెన్స్ సిద్ధహస్తుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కాంచన' .. 'కాంచన 2' సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హారర్ ను కామెడీతో కలిపి ఆయన చేసిన సందడికి మంచి మార్కులు పడ్డాయి .. భారీ వసూళ్లు సొంతమయ్యాయి.

అప్పటి నుంచి కూడా అభిమానులు 'కాంచన 3' కోసం వెయిట్ చేస్తూనే వున్నారు. ఈ సినిమా వచ్చే వేసవికి ప్రేక్షకులకు ముందుకు రానుందనేది తాజా సమాచారం. లారెన్స్ కథానాయకుడిగా .. ఆయన సరసన వేదిక - ఓవియా కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఇటీవలే టాకీ పార్టును పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఏప్రిల్ 18వ తేదీన విడుదల కానుంది. ఈ సారి లారెన్స్ ఏ రేంజ్ లో భయపెడతాడో చూడాలి. 
lawrence

More Telugu News