ఉల్లి ఎలా పండుతుంది?.. రాహుల్‌ను ఎద్దేవా చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
- గందరగోళంలో రాహుల్ బాబా
- రైతులమైన మాకు పనామా అంటే కూడా ఏంటో తెలియదు
- ఇలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని నడుపుతారట
రాహుల్ గాంధీకి ఉల్లిపాయలు ఎలా పండుతాయో? ఎక్కడ పండుతాయో కూడా తెలియదన్నారు. అవి భూమిపైన పండుతాయో, లోపల పండుతాయో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. పనామా పేపర్లలో తన కుమారుడి పేరు వచ్చిందని రాహుల్ ఆరోపిస్తున్నారని, రైతులమైన తమకు పనామా అంటే కూడా ఏమిటో తెలియదన్నారు. రాహుల్ బాబా తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ఇలా ఎప్పటికప్పుడు గందరగోళంలో ఉండే వాళ్లు ప్రభుత్వాన్ని ఏం నడుపుతారని శివరాజ్‌సింగ్ విమర్శించారు.