మన దేశాన్నే సరిగా చూసుకోలేకపోతున్నాం... ఇక మనకు కశ్మీర్ ఎందుకు?: షాహిద్ అఫ్రిది
- ఉన్న నాలుగు ప్రావిన్స్ లనే సరిగా చూసుకోలేకపోతున్నాం
- కశ్మీర్ గురించి మరిచిపోండి
- ఉగ్రవాదం నుంచి పాక్ ను రక్షించడం ప్రభుత్వాల చేత కావడం లేదు
ఉగ్రవాదుల నుంచి సొంత దేశాన్ని రక్షించడం కూడా తమ ప్రభుత్వాలకు చేత కాలేదని అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ లోయలో ప్రజలు చనిపోవడం తనను ఎంతో బాధిస్తోందని చెప్పాడు. కశ్మీర్ ను ఇండియాకు కూడా ఇవ్వొద్దని... అది ప్రత్యేక దేశం కావాలని అన్నాడు. కశ్మీర్ లో మానవత్వం పరిఢవిల్లాలని ఆకాంక్షించాడు. అఫ్రిది వ్యాఖ్యలు పాకిస్థాన్ లో వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.