తెలంగాణ భవన్ కు చేరిన సీట్ల లొల్లి.. మన్నెం గోవర్ధన్ రెడ్డి వర్గీయులపై పోలీసుల లాఠీచార్జీ!
- ఖైరతాబాద్ టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం
- తెలంగాణ భవన్ ముట్టడికి యత్నించిన నేత
- ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామన్న కేటీఆర్
ఈ సందర్భంగా తమ నాయకుడికి ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్ ను కేటాయించాలని కోరుతూ ఆయన అనుచరుడు ఒకరు తల పగులగొట్టుకున్నాడు. ఖైరతాబాద్ లో పోటీ నుంచి తప్పుకుంటే ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని మంత్రి కేటీఆర్ ఇప్పటికే గోవర్ధన్ రెడ్డికి ఆఫర్ ఇచ్చారు. అయితే ఇందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. తనకు ఖైరతాబాద్ టికెట్ కావాలని ఆయన గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది.