అభిమాని సృష్టి: 'RRR' ప్రారంభోత్సవంలో చిరంజీవితో దివంగత హరికృష్ణ... 'సో నైస్' అన్న మంచు మనోజ్!

  • నిన్న'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ప్రారంభోత్సవం
  • చిరంజీవితో పాటు క్లాప్ పట్టుకున్న హరికృష్ణ
  • వైరల్ అవుతున్న అభిమాని సృష్టించిన ఫోటో
ఎప్పుడో దివంగతుడైన నందమూరి హరికృష్ణ, నిన్న జరిగిన 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ప్రారంభోత్సవంలో చిరంజీవితో పాటు కనిపించడం ఏంటని అనుకుంటున్నారా? దాన్ని మంచు మనోజ్ పోస్ట్ చేయడం ఏంటని కన్ ఫ్యూజ్ గా ఉందా? ఎవరో అభిమాని ఇలా ఓ ఫోటోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, అది అలా ఇలా పాకి మంచు మనోజ్ దృష్టికి వెళ్లింది.

దీంతో ఈ పిక్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన మనోజ్, చూసేందుకు ఈ పిక్ చాలా బాగుందని చెప్పాడు. సూపర్ టీమ్ 'ఆర్ఆర్ఆర్'కు శుభాభినందనలు తెలిపాడు. చిత్ర టీమ్ కు భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.



Go Back to Shorts
RRR
Harikrishna
Chiranjeevi
Manchu Manoj

More Telugu News