తెలంగాణలో 13 సమస్యాత్మక నియోజకవర్గాలు.. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్!
Add ap7am to your home Screen

తెలంగాణలో 13 సమస్యాత్మక నియోజకవర్గాలు.. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్!

  • 13 సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించిన ఎన్నికల సంఘం
  • ఈ నియోజకవర్గాల్లో గంట ముందే ముగియనున్న పోలింగ్
  • డిసెంబర్ 7న పోలింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 13 సమస్యాత్మక నియోజకవర్గాలను ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తామని చెప్పింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో యథావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, మంథని, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేటలు ఉన్నాయి. డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
Telangana
assembly
constituencies
sensitive
ec

More Telugu News