తెలంగాణలో 25 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నాం.. కానీ..: పవన్ కల్యాణ్

  • ముందస్తుగానే ఎన్నికలు రావడంతో పార్టీలో సందిగ్ధత నెలకొంది
  • కొంత మంది స్వతంత్ర అభ్యర్థులు మా మద్దతు కోరుతున్నారు
  • ఒకటి, రెండు రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తాం
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 25 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నామని... ఇదే విధంగా మూడు పార్లమెంటు స్థానాల్లో కూడా బరిలోకి దిగాలనుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కానీ, ముందస్తుగానే ఎన్నికలు రావడంతో... పోటీ చేయడంపై తమ పార్టీలో సందిగ్ధత నెలకొందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రెండు, మూడు రోజుల్లో పార్టీలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. కొంత మంది అభ్యర్థులు ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నామని...  తమకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నారని అన్నారు. వీటిన్నింటిపై ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు సన్నద్ధత లేకపోవడంతో... పోటీ గురించి సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు.
Go Back to Shorts
Pawan Kalyan
Telangana
elections
janasena
contest

More Telugu News