stalin: ఢిల్లీ లేదా మరోచోట అందరం కలుస్తాం: స్టాలిన్

షార్ట్స్‌లో చూడండి
బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ నేతలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలుస్తుండటం మంచి పరిణామమని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. చంద్రబాబు ప్రయత్నాలకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. రాష్ట్రాల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. బీజేపీని గద్దె దించేందుకు చర్చలు జరుపుతున్నామని... ఇప్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని చంద్రబాబు కలిశారని తెలిపారు. ఢిల్లీ లేదా మరో చోట నేతలు అందరం కలుస్తామని చెప్పారు. కాసేపటి క్రితమే చంద్రబాబు, స్టాలిన్ ల సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
stalin
Chandrababu
modi

More Telugu News