tamannah: రానా చేతుల మీదుగా తమన్నా మూవీ ఫస్టు లుక్

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో తమన్నాకి అవకాశాలు తగ్గి చాలా కాలమే అయింది. ఆమె పారితోషికం ఎక్కువగా పెంచడం ఒక కారణమైతే, కొత్తగా వస్తోన్న కథానాయికల పోటీ ఎక్కువగా ఉండటం మరొక కారణంగా చెబుతారు. ఈ నేపథ్యంలోనే సందీప్ కిషన్ సరసన కథానాయికగా ఆమె 'నెక్స్ట్ ఏంటి' అనే సినిమా చేస్తోంది. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం.

ఈ సినిమాలో పూనమ్ కౌర్ .. నవదీప్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ ను రానా చేతుల మీదుగా రిలీజ్ చేశారు. లండన్ లో ఎక్కువభాగం చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమాను, డిసెంబర్లో విడుదల చేయనున్నారు. ఇటు తమన్నాకి .. అటు సందీప్ కిషన్ కి ఈ సినిమా హిట్ చాలా అవసరం. వాళ్ల కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.    
Go Back to Shorts
tamannah
sandeepkishan

More Telugu News