తొండాట ఆడిన పొలార్డ్... వీడియో చూసిన నెటిజన్ల తిట్లు!

  • బుమ్రా వేసిన బంతిని గాల్లోకి లేపిన పొలార్డ్
  • అందుకోవడానికి వెళ్లగా చేతులు అడ్డం
  • వీడియో వైరల్ కావడంతో విమర్శల వర్షం
వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ-20లో బ్యాట్స్ మన్ పొలార్డ్ ఆడిన ఆటతీరు ఇప్పుడు తీవ్ర విమర్శలపాలైంది. ఈ మ్యాచ్ లో గాల్లోకి క్యాచ్ లేపిన పొలార్డ్, ఆపై దాన్ని అందుకునేందుకు వచ్చిన భారత బౌలర్ బుమ్రాను అడ్డుకునేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణం. బుమ్రా వేసిన 11వ ఓవర్ నాలుగో బంతిని పొలార్డ్ ఆడగా, అది గాల్లోకి లేచింది.

దీన్ని అందుకునేందుకు బుమ్రా వెళ్లగా, అతని రెండు చేతుల మధ్య నుంచి తన చేతిని పోనిచ్చాడు పొలార్డ్. అప్పటికీ బుమ్రా బంతిని ఒడుపుగా పట్టుకుని పొలార్డ్ వైపు ఆగ్రహంగా చూడగా, పొలార్డ్ నవ్వుతూ పెవీలియన్ కు వెళ్లాడు. అతను తొండాట ఆడాడని నెటిజన్లు ఇప్పుడు తిట్ల దండకానికి దిగారు. ఈ మ్యాచ్ లో విండీస్ ఓడిపోగా, మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఇప్పటికే 2-0తో ఇండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా, బుమ్రా, పొలార్డ్ లు ఇద్దరూ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ, ఐపీఎల్ లో కలసి ఆడుతున్నారన్న సంగతి తెలిసిందే.



Go Back to Shorts
India
Westindees
Cricket
Polard
Bumra
Catch

More Telugu News