ప్రణయ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి అరెస్ట్!
- మూడు రోజుల క్రితం ప్రణయ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు
- పోలీసు గదిలోంచి పర్సు కొట్టేసిన వైనం
- తమను చంపేందుకేనన్న ప్రణయ్ తండ్రి
ప్రణయ్ కుటుంబ సభ్యులు అందించిన సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం కరక్కాయలగూడేనికి చెందిన ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అతడు పాత నేరస్తుడని పేర్కొన్నారు. ప్రణయ్ కుటుంబానికి రక్షణగా ఉన్న పోలీసు సిబ్బంది గది నుంచి అతడు పర్సును దొంగిలించినట్టు డీఎస్పీ పి.శ్రీనివాసులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు.