తిత్లీ బాధితులకు ఊరట.. నేడు భారీగా నష్టపరిహారాన్ని అందించనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్!
- రికార్డు స్థాయిలో 24 రోజుల్లోనే సాయం
- మరికాసేపట్లో శ్రీకాకుళంలో పర్యటన
- పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు
ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు జిల్లాలోని మందసలో తుపాను బాధితులకు మంత్రి లోకేశ్ నష్ట పరిహారం చెక్కులను అందజేయనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పలాస రైల్వే మైదానంలో సీఎం చంద్రబాబు, లోకేశ్ బాధితులకు చెక్కులను అందజేస్తారు. మొత్తం 19 మండలాల్లో దాదాపు 4.6 లక్షల మందికి రూ.530 కోట్ల భారీ పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం ఈ సందర్భంగా చెల్లించనుంది. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.