Goa: మనోహర్ పారికర్ ఇలానా?... ఏ మాత్రం గుర్తు పట్టలేనంతగా...!

షార్ట్స్‌లో చూడండి
మాజీ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పై ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. తీవ్ర అనారోగ్యానికి గురై, అమెరికాలో చికిత్స పొంది, తిరిగి ఇండియాకు వచ్చిన పారికర్, ఏ మాత్రం గుర్తు పట్టలేనంతగా కనిపిస్తుండటమే ఇందుకు కారణం. పారికర్, గోవా సీఎంగా పాలనా పరమైన వ్యవహారాలను నిర్వహిస్తున్నారని బీజేపీ, ఓ ఫొటోను విడుదల చేయగా, నిజాలను దాచి పెడుతూ, ఆయన ఆరోగ్యంతో బీజేపీ ఆటలాడుతోందని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఆయన్ను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేసింది.

కాగా, ఈ ఫొటోల్లో శారీరకంగా చాలా సన్నబడ్డట్టు కనిపిస్తున్న పారికర్, ఎడమ చెయ్యి స్వాధీనంలో లేనట్టు, దానికి బ్యాండ్ వేసినట్టు కనిపిస్తోంది. చేతి వేళ్లు కూడా ఆకారాన్ని కోల్పోయి వాలిపోయినట్టు తెలుస్తోంది. కాళ్లు కూడా సరైన ఆకృతిలో లేవు. ప్యాంటు లోపలి కాళ్లు చాలా బలహీనంగా అయిపోయినట్టు తెలుస్తోంది. ముఖం కూడా పూర్తిగా మారిపోయింది.

ఇక ఈ ఫొటోను విడుదల చేసిన తరువాత, అనారోగ్యంతో ఉన్నా ప్రజల గురించి గోవా సీఎం శ్రద్ధ చూపుతున్నారని కొందరు అభినందిస్తుండగా, చాలా మంది ఆయన్ను బీజేపీ పావుగా వాడుకుంటోందని, ప్రజల్లోకి ఆయన్ను తేవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
Go Back to Shorts
Goa
Manohar Parrikar
Helath
BJP

More Telugu News