పది వికెట్లు తీసిన సిదక్.. పర్ఫెక్ట్-10 జాబితాలో చేరిక!
- పర్ఫెక్ట్ 10 సాధించిన సిదక్
- కల్నల్ సీకే నాయుడు టోర్నీలో ఘనత
- గతంలోనే సచిన్ రికార్డును బ్రేక్ చేసిన సిదక్
కేవలం 17.5 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి 10 వికెట్లనూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 7 మెయిడెన్ ఓవర్లూ ఉన్నాయి. దీంతో మణిపూర్ జట్టు 71 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే సచిన్ (14) తరువాత అతి చిన్న వయసులో ముంబైకి ఆడిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్న సిదక్, ఇప్పుడు మరో రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు. పర్ఫెక్ట్-10 జాబితాలో అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్ లు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే.