ప్రభాస్ నుంచి నేర్చుకున్నది అదే: 'ఆర్ ఎక్స్ 100' హీరో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ నుంచి నేర్చుకున్నది అదే: 'ఆర్ ఎక్స్ 100' హీరో

  • ప్రభాస్ లో అంకితభావం ఎక్కువ
  • ఆయనకి ఎంతో ఓపిక  
  • ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన లక్షణం
లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ ప్రధాన అంశాలుగా వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' భారీ విజయాన్ని సాధించింది. హీరోగా చేసిన కార్తికేయకు ఈ సినిమా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. కార్తికేయ నుంచి తదుపరి సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లతో ఆయన లైవ్ చాట్ చేశాడు.

ఈ సందర్భంలోనే ఒక అభిమాని ప్రభాస్ ను చూసి ఏం నేర్చుకున్నారు? అని అడిగాడు. అందుకు కార్తికేయ స్పందిస్తూ .. "ముందుగా ప్రభాస్ ను చూడగానే 'ఏం ఉన్నాడ్రా బాబూ! అని పిస్తుంది .. ఆయన పర్సనాలిటీ అలాంటిది. ఆయన నుంచి నేర్చుకోవలసింది అంకితభావం. 'బాహుబలి' సినిమా కోసం ఆయన అన్నేసి సంవత్సరాలు కేటాయించడం .. ఆ సినిమాపై మాత్రమే దృష్టి పెట్టడం అంత ఆషామాషీ విషయమేం కాదు. ఆయన అంతటి పెద్ద హీరో అయినా ఆ విషయాన్ని గురించి పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు. అంతలా ఎదిగినా ఒదిగి ఉండటం ప్రభాస్ లో నాకు నచ్చిన లక్షణం" అని చెప్పుకొచ్చాడు.  
karthikeya

More Telugu News