నాకు ఇలియానా అంటే పిచ్చి: 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు ఇలియానా అంటే పిచ్చి: 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ

  • అప్పట్లో రమ్యకృష్ణ అంటే ఇష్టం 
  • 'పోకిరి' చూశాక ఇష్టం మారింది 
  • పాయల్ పెద్ద హీరోయిన్ అవుతుంది  
తెలుగులో ఇటీవల కాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో 'ఆర్ ఎక్స్ 100' ఒకటి. యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన ఈ సినిమా, కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఈ సినిమాలో హీరోగా చేసిన కార్తికేయకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఆయన ఫేస్ బుక్ లో లైవ్ చాట్ చేశాడు. ఈ సందర్భంలోనే మీ అభిమాన హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. 'పోకిరి' సినిమా చూడనంతవరకూ నేను రమ్యకృష్ణను ఎంతగానో అభిమానించేవాడిని. 'పోకిరి' చూసిన తరువాత ఇలియానా అభిమానిగా మారిపోయాను. ఇలియానా అంటే నాకు పిచ్చి. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ పిచ్చి అలాగే వుండిపోయింది' అని చెప్పుకొచ్చాడు. ఇక ఒక అభిమాని పాయల్ గురించి అడగ్గా .. 'ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ .. చాలా చక్కగా నటిస్తుంది .. భవిష్యత్తులో ఆమె పెద్ద హీరోయిన్ అవుతుందనే నమ్మకం వుంది' అని చెప్పుకొచ్చాడు.       
karthikeya

More Telugu News