'హౌస్ ఫుల్ 4' సెట్స్ పైకి రానా
- కొత్తదనానికి రానా ప్రాధాన్యత
- ఇతర భాషల నుంచి అవకాశాలు
- 'హౌస్ ఫుల్ 4'లో ఖాన్ పాత్ర
సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఫర్హాద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అక్షయ్ కుమార్ .. రితేశ్ దేశ్ ముఖ్ .. బాబీ డియోల్ .. కృతీ సనన్ .. కృతి కర్బందా .. పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో తాను చేస్తోన్న పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందనీ .. తన నటనలో మరో కోణాన్ని ఈ పాత్ర ద్వారా ఆవిష్కరించే అవకాశం కలిగిందని రానా చెబుతున్నాడు. ఇక తెలుగులోను ఆయన విభిన్నమైన కథలను చేస్తున్న సంగతి తెలిసిందే.