ys jagna: జగన్ పై దాడిని ఖండించిన లగడపాటి
వైసీపీ అధినేత జగన్ పై ఇటీవల జరిగిన దాడిని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఖండించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆ ఘటన దురదృష్టకరమని, సీఎం, ప్రతిపక్ష నేత.. ఇలా ఎవరిపైనా దాడులు మంచివి కాదని అన్నారు. మనది ప్రజాస్వామిక దేశమని, మార్పు తీసుకురావడానికి చాలా మార్గాలు ఉన్నాయని, దాడుల వల్ల ఎటువంటి మార్పు తీసుకురాలేమని అన్నారు. జగన్ పై దాడి ఘటనపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరుతున్నారని, దీనిపై ఆయన అభిప్రాయం కోరగా ఆయన బదులివ్వలేదు.