కేసీఆర్ మాదిరే చంద్రబాబు కూడా అవినీతిపరుడు: రాంమాధవ్
Add ap7am to your home Screen

కేసీఆర్ మాదిరే చంద్రబాబు కూడా అవినీతిపరుడు: రాంమాధవ్

  • కేసీఆర్ కుటుంబం బంగారుమయమైంది
  • మోదీకి భయపడే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు
  • దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం తెలంగాణ
ప్రధాని మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతాననే భయంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగుతోందని... రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని, కేసీఆర్ కుటుంబం బంగారుమయం అయిందని విమర్శించారు. దేశంలోనే అత్యంత  అవినీతి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణను అవినీతి రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. ఆర్మూరులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈమేరకు వ్యాఖ్యానించారు.

కేసీఆర్ మాదిరే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అవినీతిపరుడని రాంమాధవ్ అన్నారు. అవినీతిలో ఏపీ రెండో స్థానంలో ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో విటమిన్ ఇంజెక్షన్లను తీసుకుంటోందని విమర్శించారు. తెలంగాణ కోసం గళమెత్తిన తొలి పార్టీ బీజేపీ అని చెప్పారు.
Chandrababu
ram madhav
kcr

More Telugu News