రాహుల్ గాంధీ, చంద్రబాబులపై దేవేగౌడ ప్రశంసలు!
- మహాకూటమి ఏర్పాటు కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారు
- కూటమి అధికారంలోకి వస్తే రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం
- రాహుల్ కు నేను పూర్తి మద్దతు ఇస్తాను
మహాకూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దేవేగౌడ చెప్పారు. రాహుల్ కు తాను పూర్తి మద్దతు ఇస్తానని తెలిపారు. ఇటీవలి కాలంలో రాహుల్ విశేషమైన రాజకీయ అనుభవాన్ని సొంతం చేసుకున్నారని కితాబిచ్చారు. బళ్లారి పార్లమెంటు ఉపఎన్నిక సందర్భంగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప గెలుపు కోసం జేడీఎస్ కృషి చేస్తుందని చెప్పారు.