Hyderabad: హైదరాబాద్‌ను వణికిస్తున్న చలి.. రేపటి నుంచి మరింత విజృంభణ

షార్ట్స్‌లో చూడండి
దీపావళి కూడా రాకుండానే హైదరాబాద్‌లో చలి వణికిస్తోంది. గత వారం రోజులుగా చలిగాలులు తీవ్రమయ్యాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలు నగరవాసులను వణికిస్తున్నాయి. రేపటి నుంచి శీతల గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రిపూట ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్టు పేర్కొంది. మంగళవారం హైదరాబాద్‌లో గరిష్టంగా 31.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, 16.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ఉదయం పూట చలి గాలులు తీవ్రంగా వీస్తుండడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గత నాలుగు రోజులుగా వీటి తీవ్రత మరింత ఎక్కువైంది. ముఖ్యంగా చెట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది. చలికాలంలో సాధారణంగా 15-16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
Go Back to Shorts
Hyderabad
Winter
Telangana
temperature
winds

More Telugu News