ys jagan: నిందితుడు శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత: వైసీపీ నేత మేకపాటి

షార్ట్స్‌లో చూడండి
జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే ఏపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అవసరమైతే, కోర్టును ఆశ్రయిస్తామని, కోర్టు ద్వారా కేంద్రానికి ఆదేశాలు ఇప్పించైనా సరే, నిష్పాక్షిక విచారణ జరిగేలా చూస్తామని, ఈ ఘటన వెనుక సూత్రధారులెవరో తేలాలని డిమాండ్ చేశారు.

టీడీపీ నేతలే కుట్రకు పాల్పడ్డారని అనుమానం

నిందితుడు శ్రీనివాస్ కు టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.  టీడీపీ నేతలే కుట్రకు పాల్పడ్డారని తమకు అనుమానంగా ఉందని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడే తనకు ప్రాణహాని ఉందంటున్నాడని, ప్రజలకు వాస్తవాలు తెలియాలని బొత్స అన్నారు.
Go Back to Shorts
ys jagan
mekapati
Telugudesam

More Telugu News