కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తండ్రి.. ఎస్పీగా వచ్చిన తనయుడు!
- ఎస్పీగా కొడుకు పర్యవేక్షణలో పనిచేయనున్న కానిస్టేబుల్ తండ్రి
- ఒకేచోట పనిచేయడంపై ఇద్దరూ సంతృప్తి
- వ్యక్తిగత బంధాలపై వృత్తి ధర్మం ప్రభావం చూపబోదని స్పష్టీకరణ
ఈ పరిణామంపై తండ్రీకొడుకులిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు. కొడుకు సాధించిన విజయం గర్వ కారణమని జనార్దన్ తెలిపారు. కొడుకు పర్యవేక్షణలో పని చేయడం సంతోషంగా ఉందని, గౌరవంగా భావిస్తున్నానని ఆయన ఉప్పొంగిపోయాడు. విధుల్లో భాగంగా ప్రొటోకాల్ పాటిస్తానని మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
ఎస్పీగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అనూప్.. తండ్రితో కలిసి పనిచేయడం సంతోషకరమన్నాడు. వృత్తి ధర్మం తమ వ్యక్తిగత బంధాలపై ప్రభావం చూపబోదని ఆయన అన్నారు. ఇదిలావుండగా లక్నోకు చెందిన జనార్దన్, కాంచన్ దంపతులకు అనూప్ ఏకైక కుమారుడు కావడం గమనార్హం.