విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్!
- హీందీలో తెరకెక్కుతున్నఅర్జున్ రెడ్డి
- కబీర్ సింగ్ గా టైటిల్ ఖరారు చేసిన యూనిట్
- బెస్ట్ విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ
దీనికి హీరో షాహీద్ కపూర్ వెంటనే స్పందించాడు.‘ఈ సినిమాలో మీ పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది బ్రదర్. ఎన్ని రీమేక్‌లు వచ్చినా నీదే ఒరిజినల్’ అంటూ ప్రశంసలు కురిపించాడు. షాహీద్ ట్వీట్ కు విజయ్ మళ్లీ జవాబిస్తూ..‘.‘బిగ్ బ్రదర్.. మీపట్ల నాకూ ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. మీరు, సందీప్ కలిసి కచ్చితంగా మ్యాజిక్ చేస్తారు. మిమ్మల్ని కబీర్‌గా చూడాలని ఎంతో ఆత్రుతగా ఉన్నా’ అని ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో షాహీద్ కు జోడీగా ‘భరత్ అనే నేను ఫేం’ కైరా అద్వాణీ నటిస్తోంది. వచ్చే ఏడాది జూన్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.