ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన జగన్.. సీఎం..సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించిన అభిమానులు!
- ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జగన్
- అభిమానులకు అభివాదం చేసిన నేత
- భారీగా చేరుకున్న అభిమానులు
నిన్న వైజాగ్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై ఎయిర్ పోర్ట్ లో శ్రీనివాసరావు అనే యువకుడు కోడిపందేలకు వాడే కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత ప్రాథమిక చికిత్స తీసుకున్న జగన్ హైదరాబాద్ కు వచ్చి సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరారు. గాయం లోతుగా కావడంతో వైద్యులు జగన్ చేతికి 9 కుట్లు వేశారు. ఈ దాడిని తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పార్లమెంటు సభ్యురాలు కవిత, మంత్రి తలసాని సహా పలువురు ప్రముఖులు ఖండించారు.