జగన్ పై దాడి చేసిన యువకుడి పేరు శ్రీనివాస్.. ఊరు కోనసీమలోని ఠాణేలంక!

  • అమలాపురంకు చెందిన వ్యక్తి
  • విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంటులో పని చేస్తున్నాడు
  • పోలీసుల అదుపులో శ్రీనివాస్
వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలోని విజిటింగ్ లాంజ్ లో కత్తితో దాడి జరిగిన ఘటన ఇరు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి, హైదరాబాదుకు బయల్దేరుతున్న సమయంలో ఆయనపై ఈ దాడి జరిగింది. జగన్ పై దాడికి యత్నించిన యువకుడి పేరు శ్రీనివాస్. ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంటులో వెయిటర్ గా పని చేస్తున్నాడు. అతను తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన వ్యక్తి.

దాడి జరిగిన వెంటనే శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ, విచారణ జరుగుతోందని, ఒక గంటలో అన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.  
Go Back to Shorts
jagan
attack
sirnivas

More Telugu News