Andhra Pradesh: ఏపీ రాజధానిలో ‘డెలాయిట్’.. కుదిరిన ఒప్పందం

షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజధాని అమరావతిలో డెలాయిట్ కంపెనీ త్వరలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఏపీ ఐటీ శాఖ, డెలాయింట్ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖ ఫెస్టివల్ లో సీఎం చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సంస్థ కార్యకలాపాలను అమరావతిలోని తాత్కాలిక భవనంలో త్వరలో ప్రారంభించనున్నట్టు సమాచారం. విశాఖలో కూడా ‘డెలాయిట్’ కార్యకలాపాలను కొనసాగించాలని సంస్థ ప్రతినిధులను లోకేశ్ కోరగా, అవకాశాలపై అధ్యయనం చేస్తామని, ఈ విషయమై దృష్టి పెడతామని వారు పేర్కొన్నారు. 
Go Back to Shorts
Andhra Pradesh
deloitte
Chandrababu
lokesh

More Telugu News