‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ ఎంజాయ్ చేసేందుకే తెలంగాణ వచ్చినట్టుగా ఉంది!: ఉత్తమ్ ఫైర్
- కేసీఆర్ కు బానిసలుగా ఉండాలా?
- ఉద్యమం కోసం కేసీఆర్, కేటీఆర్ చేసిందేమీ లేదు
- ‘మహాకూటమి’తో వాళ్లు లాగులు తడుస్తున్నాయి
ప్రజల డబ్బులతో కోట్ల విలువ చేసే ఇల్లు కట్టుకున్నారని, వారు కొనుక్కొన్న ఒక్కొక్క కారు విలువ రూ.4 కోట్లని కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశారు. దోచుకుని, దాచుకున్న డబ్బుని వచ్చే ఎన్నికల్లో పంచి పెట్టి, మద్యం సరఫరా చేసి గెలవాలని కేసీఆర్ కుటుంబం చూస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ, ఈ ఉద్యమం కోసం కేసీఆర్, కేటీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. మహాకూటమితో ముందుకెళ్తుంటే కేసీఆర్ కు, ఆయన కుటుంబసభ్యులకు లాగులు తడుస్తున్నాయని విమర్శించారు.