ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో గిఫ్ట్... రియల్ స్పీడ్, రియల్ యాక్షన్... 'షేడ్స్ ఆఫ్ సాహో' వీడియో విడుదల!
- అభిమానులకు మరో ట్రీట్ ఇచ్చిన 'సాహో' యూనిట్
- అదరగొడుతున్న అబూదాబి ఫైట్ మేకింగ్ వీడియో
- వీడియోకు సంగీతాన్ని అందించిన థమన్
హాలీవుడ్ నిపుణులను రంగంలోకి దించిమరీ షూట్ చేసిన ఫైట్ సీన్ కు సంబంధించిన కొన్ని దృశ్యాలను, మేకింగ్ వీడియోను విడుదల చేశారు. అబుదాబిలో ఈ చిత్రం షూటింగ్, కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వీడియోకు థమన్ సంగీతం అందించాడు. 'సాహో' కు మాత్రం శంకర్ ఈశన్ లాయ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. నిమిషాల వ్యవధిలో లక్షల వ్యూస్ సాధించి, నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరూ చూడండి.