జగన్ ఆదేశిస్తే అద్దంకి నుంచి పోటీ చేస్తా!: వైసీపీ కార్యదర్శి వెంకటరెడ్డి
- మెజారిటీ నేతలు నన్నే కోరుకుంటున్నారు
- కుటుంబంతో చర్చించి నిర్ణయం తీసుకుంటా
- నియోజకవర్గంలో పార్టీ గెలుపుకు కృషి చేస్తా
అద్దంకి నియోజకవర్గంలో పోటీ చేసే విషయమై పార్టీ అధినేత వైఎస్ జగన్ తో ఇప్పటికే మాట్లాడానని వెంకటరెడ్డి అన్నారు. ఇందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. త్వరలోనే నియోజకవర్గం అంతటా పర్యటించి పార్టీ గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. ఎలాంటి భేషజాలు లేకుండా జిల్లా నాయకులను కలుపుకుపోతానని వెంకటరెడ్డి చెప్పారు.