Hyderabad: తెనాలి నుంచి హైదరాబాద్ వస్తూ... రెండు వంతెనల మధ్య ఇరుక్కున్న బస్సు!

షార్ట్స్‌లో చూడండి
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. తెనాలి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కొత్తగూడెం వద్ద అదుపుతప్పి, రెండు వంతెనల మధ్య చిక్కుకుంది. అయితే, బస్సు రెండు వంతెనల మధ్య నుంచి కిందకు పడిపోలేదు. దీంతో అందులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ కు మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి.

విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు, బస్సులోని ప్రయాణికులను క్షేమంగా వెలుపలికి తీసుకువచ్చారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటుండగా, కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 
Go Back to Shorts
Hyderabad
Tenali
Private Bus
Bridges

More Telugu News