నాకు ఇష్టమైన పాత్ర ఏదంటే ఇదేనని చెబుతాను: హీరో రామ్
Add ap7am to your home Screen

నాకు ఇష్టమైన పాత్ర ఏదంటే ఇదేనని చెబుతాను: హీరో రామ్

  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపిస్తాను
  • ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కథ 
  • సక్సెస్ పై గట్టి నమ్మకం వుంది    
రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'హలో గురు ప్రేమకోసమే' నిర్మితమైంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో నేను విలేజ్ నుంచి సిటీకి వచ్చిన కుర్రాడిగా .. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపిస్తాను.

దర్శకుడు త్రినాథరావు .. రచయిత ప్రసన్నకుమార్ నా పాత్రను అద్భుతంగా మలిచారు. ఇప్పటివరకూ నేను చాలా పాత్రలు పోషించాను. నాకు ఇష్టమైన పాత్ర ఏదంటే మాత్రం ఈ పాత్రేనని చెబుతాను. ఈ పాత్రను చేస్తున్నప్పుడు నేను ఎంతో ఎంజాయ్ చేశాను. నా పాత్ర .. ప్రకాశ్ రాజ్ .. అనుపమ పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాత్రను మేం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం వలన, తప్పకుండా సక్సెస్ లభిస్తుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.     
ram
anupama

More Telugu News