మంచి మనసును చాటుకున్న సంపూర్ణేష్ బాబు.. తిత్లి తుపాను బాధితులకు తన వంతు సాయం!
- ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 వేల విరాళం
- బాధితులను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని విన్నపం
- శ్రీకాకుళం జిల్లా చాలా నష్టపోయిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నానన్న సంపూ
'తిత్లి తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లా చాలా నష్టపోయిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నా. నా వంతుగా రూ. 50 వేలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నా. మన వంతు సాయంగా చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటున్నా' అంటూ ట్విట్టర్ ద్వారా విన్నవించారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి సినీ రంగం నుంచి ముందుకు వచ్చిన తొలి వ్యక్తి సంపూర్ణేష్ బాబే కావడం గమనార్హం. ఈ సందర్భంగా తుపాను బీభత్సాన్ని తెలిపే కొన్ని ఫొటోలను కూడా ఆయన అప్ లోడ్ చేశారు.