తెలంగాణలో పోటీపై నాలుగైదు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్న పవన్!
Add ap7am to your home Screen

తెలంగాణలో పోటీపై నాలుగైదు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్న పవన్!

  • తెలంగాణలో ఎన్నికలపై స్పందించిన పవన్‌
  • నాలుగైదు రోజుల్లోగా స్పష్టత
  • మీడియా సమావేశంలో వెల్లడి 
ఈరోజు ఏపీలోని అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా త్వరలో తెలంగాణలో జరిగే ఎన్నికలపై పవన్‌ స్పందించారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం 2019లో ఎన్నికలు జరిగితే  23 లేదా 24 స్థానాల్లో పోటీ చేద్దామని అనుకున్నామని, కానీ ఇక్కడ ముందస్తు ఎన్నికలు వచ్చాయని అన్నారు. ఎన్నికలలో పోటీ చేసే విషయమై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని మీడియా సమావేశంలో తెలియజేశారు.
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
Telangana
amaravati

More Telugu News