టీఆర్ఎస్ అధిష్ఠానం నాకు అన్యాయం చేసింది.. రెబెల్ గా పోటీచేస్తా!: కావేటి సమ్మయ్య
- ప్రత్యేక తెలంగాణ కోసం రాజీనామా చేశా
- టీఆర్ఎస్ లో ఇప్పుడు ఉద్యమ వ్యతిరేకులే ఉన్నారు
- హైకమాండ్ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలి
తాను పార్టీ హైకమాండ్ ను కలిసిన ప్రతిసారీ తనకు న్యాయం చేయాలని కోరాననీ, కాని సిర్పూర్ కాగజ్ నగర్ టికెట్ ను బయటి వ్యక్తి అయిన కోనేరు కోనప్పకు కేటాయించి పార్టీ అధిష్ఠానం తనకు ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడని, పోరాడని వాళ్లే ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారని విమర్శించారు. ఇప్పటికైనా హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకోవాలనీ, సిర్పూర్ టికెట్ ను తనకు కేటాయించాలని కోరారు. లేదంటే రెబెల్ గా పోటీ చేస్తానని ప్రకటించారు.