ఆకట్టుకుంటోన్న 'హలో గురు ..' ట్రైలర్
Add ap7am to your home Screen

ఆకట్టుకుంటోన్న 'హలో గురు ..' ట్రైలర్

  • ఎమోషన్ తో కూడిన ప్రేమకథ 
  • కామెడీ పరంగాను ప్రాధాన్యత
  • అలరిస్తోన్న సంభాషణలు  
రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'హలో గురూ ప్రేమకోసమే' సినిమా రూపొందింది. యాక్షన్ తో కూడిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. దసరా కానుకగా ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

"స్కూల్ అయినా .. కాలేజ్ అయినా .. ఆఫీస్ అయినా కొత్తగా జాయిన్ అయిన ఫస్టు డే అందరూ చేసే ఫస్టు పనేంటో తెలుసా? అమ్మాయిల్లో ఎవరు బాగున్నారా అని అబ్బాయిలు, అబ్బాయిల్లో ఎవరు బాగున్నారా అని అమ్మాయిలు ఏరుకోవడం".. "అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారోలేదో తెలియదు గానీ, అబద్ధాలు చెబితే మాత్రం అమ్మాయిలు కచ్చితంగా పడతారు" వంటి డైలాగ్స్ బాగున్నాయి. యూత్ హృదయాలను కొల్లగొట్టే సీన్స్ ఈ సినిమాలో కావాల్సినన్ని ఉన్నాయనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.
ram
anupama

More Telugu News