త్రివిక్రమ్ తో బన్నీ ముచ్చట తీరేలానే వుంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ తో బన్నీ ముచ్చట తీరేలానే వుంది

  • బన్నీకి కథ వినిపించిన త్రివిక్రమ్ 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బన్నీ 
  • 'అరవింద' రిజల్ట్ కోసం వెయిటింగ్
'అరవింద సమేత వీర రాఘవ' తరువాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై వెంకటేశ్ తో త్రివిక్రమ్ ఒక సినిమా చేయవలసి వుంది. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి త్రివిక్రమ్ సిద్ధంగానే వున్నాడు. కానీ తాను 'వెంకీ మామ' చేశాక ఆ ప్రాజెక్టును మొదలుపెడదామని త్రివిక్రమ్ తో వెంకటేశ్ అన్నారట. ఈ లోగా మరో ప్రాజెక్టు చేసుకోమని కూడా చెప్పారట. దాంతో బన్నీతో చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ వున్నాడని టాక్. ఆల్రెడీ గతంలో బన్నీకి త్రివిక్రమ్ ఒక కథను వినిపించడం .. ఆ కథకి బన్నీ ఓకే చెప్పేయడం జరిగిపోయాయి. ఈ కథను బౌండ్ స్క్రిప్ట్ గా మార్చడం మాత్రమే మిగిలి వుందట. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు హిట్లు అందుకున్న బన్నీ .. మూడో హిట్ ను కొట్టాలని ముచ్చట పడుతున్నాడు. అయితే 'అరవింద సమేత' రిజల్ట్ చూసిన తరువాత త్రివిక్రమ్ ప్రాజెక్టు విషయంలో ఒక క్లారిటీకి రావొచ్చని వెయిట్ చేస్తున్నాడట.   
allu arjun
trivikram

More Telugu News