తెలంగాణ లో ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం ఉంది: ఉమేష్ సిన్హా కమిటీ నివేదిక
Add ap7am to your home Screen

తెలంగాణ లో ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం ఉంది: ఉమేష్ సిన్హా కమిటీ నివేదిక

  • ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం
  • ఓపీ రావత్ కు నివేదిక అందజేసిన ఉమేష్ సిన్హా కమిటీ
  • తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరమన్న నివేదిక
తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేవని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ కు ఉమేష్ సిన్హా కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఉమేష్ సిన్హా కమిటీ తమ నివేదికను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ కు అందజేసింది.

 తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగానే ఉన్నాయని, అనుకూల వాతావరణం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో అన్ని రాజకీయపార్టీల అభిప్రాయాలను సేకరించామని, ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని  ఆ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించవచ్చని ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
Telangana
umesh sinha committe

More Telugu News